కూడలి: తెలుగు బ్లాగుల

href='http://koodali.org/' title='కూడలి: తెలుగు బ్లాగుల సమాహారం'> కూడలి

18, అక్టోబర్ 2010, సోమవారం

మదురంమైన తెలుగు

10 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

ha!ha!!

అజ్ఞాత చెప్పారు...

తెలుగు, భారత దేశము లోని దక్షిణ ప్రాంతములోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపు అధికార భాష, మరియు దాని పక్క రాష్ట్రములయిన తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్ ప్రజలు మాట్లాడే భాష. ప్రపంచంలోని భాషలలో అత్యధికముగా మాట్లాడు భాషలు వాటిలో పదిహేనవ స్థానములోనూ, భారత దేశము మాతృభాషలలో మూడవ స్థానములోను నిలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 9కోట్ల మందికి పైగా ఈ భాషను మాట్లాడతారు. అతి ప్రాచీన దేశ భాషలలో సంస్కృతము, తమిళముల తో బాటు తెలుగు భాషను అక్టోబరు 31, 2008న భారత ప్రభుత్వము చేర్చింది. vikipidiyanumdi.

g.mohanrao చెప్పారు...

తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స ”

—శ్రీ కృష్ణదేవ రాయలు

అజ్ఞాత చెప్పారు...

“ సంస్కృతంబులోని చక్కెర పాకంబు
అరవ భాషలోని అమృతరాశి
కన్నడంబులోని కస్తూరి వాసన
కలిసిపోయె తేట తెలుగునందు? ”

— మిరియాల రామకృష్ణ

అజ్ఞాత చెప్పారు...

“ జనని సంస్కృతంబు సకల భాషలకును
దేశభాషలందు తెలుగు లెస్స
జగతి తల్లికంటె సౌభాగ్యసంపద
మెచ్చు టాడుబిడ్డ మేలు గాదె? ”

— వినుకొండ వల్లభరాయడు

అజ్ఞాత చెప్పారు...

"దేశ భాషలందు తెలుగు లెస్స", "ఎందరో మహానుభావులు అందరికీ వందనములు" ," పంచదార కన్న పనస తొనల కన్న కమ్మని తేనె కన్న తెలుగు మిన్న"

కిషొర్ చెప్పారు...

దన్యవాదములు

కిషొర్ చెప్పారు...

scinteri

p.sheela చెప్పారు...

మా తెలుగు తల్లికి మల్లె పూదండ
మా కన్న తల్లికి మంగళారతులు
కడుపులో బంగారు కను చూపులో కరుణ
చిరునవ్వు లో సిరులు దొరలించు మా తల్లి


గల గలా గోదారి కదలి పోతుంటేను
బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలు తాయి


అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి యుండే దాక


రుద్రమ్మ భుజ శక్తి
మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి కృష్ణరాయల కీర్తి
మా చెవుల రింగుమని మారు మ్రోగే దాక


నీ ఆటలే ఆడుతాం
నీ పాటలే పాడుతాం

జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ!

chanti..(satyam.p) చెప్పారు...

తెలుగులొ కొన్ని సామెతలు...

1.కిట కిట తలుపులు, కిటారి తలుపు, ఎప్పుడు తీసిన చప్పుడు కావు, ఏమిటవి?

విప్పితే: కనురెప్పలు!
[2] మామ కాని మామ, ఎవ్వరది?

విప్పితే: చందమామ!
[3] చుట్టింటికి మొత్తే లేదు

జవాబు: కోడి గుడ్డు
[4] నల్ల బండ క్రింద నలుగురు దొంగలు

జవాబు: బర్రె(గేదె, ఎనుము) క్రింది పొదుగులు
[5] అమ్మ అంటే కదులుతాయి, నాన్న అంటే కదలవు

జవాబు: పెదవులు
[6] అమ్మ అంటే కలుస్తాయి, నాన్న అంటే కలవవు

జవాబు: పెదవులు
[7] అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికొచ్చింది, తైతక్కలాడింది

విప్పితే: కవ్వము!
తెల్లటి బంతి చల్లని బంతి అందని బంతి ఆడని బంతి

జవాబు: జాబిలి
[8] దేశదేశాలకు ఇద్దరే రాజులు

జవాబు: సూర్యుడు, చంద్రుడు